సాధారణంగా కొందరూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. కొందరూ కావాలని పెట్టి కస్టాలు కొని తెచ్చుకుంటుంటే.. మరికొందరూ వాటిని షేర్ చేసి లైక్ చేసి ఆ వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే స్వల్ప గాయాలత బయటపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన భార్య అన్న లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారు.
దీంతో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకొని గోప్యంగా విచారిస్తున్నారు. కర్నూలు జిల్లా గూడురులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజినోవా, వాళ్ల కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారట యువకులు, గుంటూరులో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసారు పోలీసులు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్ గా గుర్తించారు.