గ్రేటర్ విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు కొత్త మేయర్ ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై టీడీపీ, జనసేన చర్చలు జరుపుతున్నాయి. 96ల వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని కూటమి నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు లభించే ఛాన్స్ ఉంది.
అయితే ప్రస్తుతం విశాఖ డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్న జియ్యానీ శ్రీధర్ పై అవిశ్వాసంపై ఈనెల 26వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఈ రెండు పదవులు ఖాళీ అవుతాయి. అప్పుడు విశాఖ కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ల పేర్లు ఎంపిక చేసి ఎన్నికల సంఘానికి పంపాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.