వేసవిలో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు.ఎండల తీవ్రత కారణంగా తెలంగాణలో వడదెబ్బ తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృత్యువాత పడ్డారు.రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రెండు, మూడు మినహా దాదాపు అన్ని జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.ఇక వడదెబ్బ కారణంగా ఖమ్మం, కరీంనగర్,నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు మరణించారు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు సమాచారం.