ఎలాంటి ఆహార పదార్థాలు అయినా సరైన విధంగా తీసుకుంటేనే వాటి నుండి పోషకాలను పొందవచ్చు. కాకపోతే తెలియకుండా కొన్నికొన్ని పొరపాట్లను చేసి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. భారతదేశంలో ఎక్కువగా పెరుగుని అందరూ వినియోగిస్తూ ఉంటారు మరియు ఎన్నో రకాల వంటకాలలో దీనిని ఉపయోగించడం సహజమే. అంతేకాకుండా వేసవికాలంలో మజ్జిగ, పెరుగు వంటి వాటిని చాలా శాతం మంది తీసుకుంటారు. పెరుగుని తినడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి.
బయట లభించే పెరుగు కంటే ఇంట్లో తయారు చేసిన పెరుగు ఎంతో ఆరోగ్యకరం. కాకపోతే సరైన పద్దతి లో తయారు చెయ్యాలి. పెరుగును తయారు చెయ్యడానికి ఇత్తడి, రాగి వంటి పాత్రలను ఉపయోగిస్తారు. కానీ ఇలా ఉపయోగిస్తే పెరుగు విషంగా మారే అవకాశాలు ఉంటాయి. కనుక ఇత్తడి, రాగి వంటి పాత్రలను పెరుగు తయారీకి ఉపయోగించకూడదు. అయితే పెరుగును తయారు చేయడానికి గాజు, మట్టి, సిరామిక్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి పాత్రలను ఉపయోగించాలి. ఎప్పుడైతే ఇటువంటి పాత్రలను ఉపయోగిస్తారో పెరుగులో ఉండే రసాయనిక అంశాలు మారకుండా ఉంటాయి.
కనుక ఈ పాత్రలను ఉపయోగిస్తే ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి పెరుగును తయారు చేయడానికి ఈ పాత్రలను ఉపయోగించండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రాగి మరియు ఇత్తడి పాత్రలను ఉపయోగించి పెరుగును తయారు చేస్తారో కొన్ని రకాల రసాయనిక చర్యలు జరుగుతాయి. దీంతో కాపర్ సల్ఫేట్ లేక ఇతర హానికర సమ్మేళనాలు ఏర్పడతాయి. దీంతో ఆరోగ్యం పై ఎంతో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి, వాంతులు, వికారం, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.