betting apps promotion case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన బెట్టింగ్ కేసులు సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసుల్లో 25 మంది సెలబ్రిటీల పై కేసులు నమోదు అయ్యాయి.

కాగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఐజీ ఎం రమేశ్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ నియామకం అయ్యారు. ఇక ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన బెట్టింగ్ కేసులు సీఐడీకి బదిలీ చేసింది.