మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై రిపోర్ట్ ఇచ్చిన NDSA

-

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి NDSA రిపోర్ట్ అందింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై రిపోర్ట్ ఇచ్చింది NDSA. రిపోర్టును సీఎస్ శాంతికుమారికి మెయిల్ చేశారు NDSA చీఫ్ అనిల్ జైన్.

NDSA submits report on Medigadda, Annaram and Sundilla barrages

మేడిగడ్డ బ్యారేజ్‌లో బ్లాక్-7లో సమస్య చాలా తీవ్రంగా ఉందని, స్తంభాలు, రాఫ్ట్ (బ్యారేజ్ కింది భాగం) కుంగిపోయాయని, బ్యారేజీ కింద నేలలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని రిపోర్ట్ ఇచ్చింది NDSA.

ఈ సమస్యకు ముఖ్య కారణం సెకాంట్ పైల్ కటాఫ్‌ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడమేనని నివేదిక ఇచ్చింది. ఈ కటాఫ్‌లలో మరిన్ని రంధ్రాలు ఉండే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇవి మరింత నష్టం కలిగించవచ్చని హెచ్చరించింది నివేదిక.

Read more RELATED
Recommended to you

Latest news