దాయాది పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు అమాయకులైన 26 మంది టూరిస్టుల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం పాక్‌ను దౌత్యపరంగా కట్టడి చేయడంతో పాటు బోర్డర్లో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్‌కు భారత జవాన్లు దీటుగా బదులిస్తున్నారు.
ఈ క్రమంలోనే భారత్‌తో యుద్ధంకు సిద్ధమైన పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం పాక్‌లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి, రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. ఆ దాడికి సంబంధించిన వీడియోను బలూచిస్థాన్ తాజాగా విడుదల చేసింది.పాక్ నుంచి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్య్రం కోరుతున్న విషయం తెలిసిందే.