బీఆర్ఎస్ పోస్టర్లు చించుతూ యాక్సిడెంట్ చేసిన హైడ్రా డీసీఎం

-

రాష్ట్రంలో హైడ్రా సిబ్బంది అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం మానేసి బీఆర్ఎస్ పోస్టర్లు చింపే పనిలో బిజీగా ఉందని గులాబీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి హైడ్రా సిబ్బంది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లను చించివేసి వెళ్లే క్రమంలో హైడ్రా డీసీఎం యాక్సిడెంట్ చేసినట్లు సమాచారం.

బీఆర్ఎస్ పోస్టర్లు చింపి పారిపోతూ మరో వాహనాన్ని హైడ్రా సిబ్బంది గుద్దినట్లు తెలిసింది. అయితే, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను హైడ్రా సిబ్బంది చించివేయడంపై గులాబీశ్రేణులు మండిపడుతున్నారు. ఇళ్ల కూల్చివేతలు ఆపేసి, పోస్టర్లు చింపేసే పనులను హైడ్రా పెట్టుకుందని విమర్శిస్తున్నారు.కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో హైడ్రా పోస్టర్లను చింపి వేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news