మరో 20 ఏళ్లు నేనే – సీఎం రేవంత్ రెడ్డి సంచలనం

-

కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.  తాను మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్టులు చేయలేనని తెలిపారు. తాను కమిట్‌మెంట్ ఇస్తే చేసి తీరుతానని వెల్లడించారు. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానన్నాను.. ఇప్పించానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు

తాము చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకపడ్డామన్నారు. ఆప్షన్ లేకే కొందరు అధికారులను కొనసాగిస్తున్నామని చెప్పారు.అధికారం పోయింది అనే బాధతో మాట్లాడినట్టు ఉంది కేసీఆర్ స్పీచ్ అని… కేసీఆర్ స్పీచ్ లో పస లేదని చురకలు అంటించారు. ఈ ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోడీ ఇద్దరూ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని వెల్లడించారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . దీనిపై ఎవరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news