గ్రూప్-1 అభ్యర్థుల నియామకంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..

-

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ అంశంలో టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ రేపు తెలంగాణ హైకోర్టులో జరగనుంది. ఇక గ్రూప్-1 నియామక ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ 19మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు.

ముఖ్యంగా రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులే అధిక సంఖ్యలో ఎంపిక కావడం పట్ల 20మంది అభ్యర్థులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు, అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాలంటూ టీజీపీఎస్సీని ఆదేశించింది. అయితే, నియామక పత్రాలను మాత్రం తుది తీర్పు తర్వాతే ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇప్పుడిప్పుడే అప్పీల్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news