తెలంగాణలో ఇంజినీరింగ్ , అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న EAPCET-2025 పరీక్షలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ నేపథ్యంలోనే EAPCET కన్వీనర్ బి.డీన్ కుమార్ విద్యార్థులకు తగు సూచనలు చేశారు. పరీక్షా సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్దకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు.ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని అన్నారు.ఇక ఎప్సెట్ పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడుపుతోందని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్ డీన్ కుమార్ వెల్లడించారు.