కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతను ప్రారంభించిన విషయం తెలిసిందే. వారు శాంతి చర్చలకు పిలుపునిచ్చిన కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో కర్రిగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు.. మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
8 రోజులుగా కర్రి గుట్టల్లో ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతుండగా.. ప్రస్తుతం భద్రతా బలగాలు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.మొత్తం 25 వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం..అల్లూరి ఏజెన్సీలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.దీంతో అప్రమత్తమైన బలగాలు వారిపై కాల్పులు జరపగా మావోయిస్టులు,పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం మావోయిస్టులు పరారైనట్లు సమాచారం