మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు మీద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. 2009లో కేసీఆర్ చేత ఆమరణ నిరాహార దీక్ష చేసేలా చేసింది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన తెలిపారు.
మంగళవారం నాంపల్లిలోని గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ను ఆమరణ నిరాహార దీక్ష చేసేలా చేసింది మా కాంగ్రెస్ నాయకులే అని అన్నారు. కేసీఆర్ దీక్ష డ్రాప్ అయ్యే సమయంలో కాంగ్రెస్ నాయకులంతా వెళ్లి దీక్ష ఆపొద్దని చెప్పామని గుర్తుచేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కర్త, కర్మ, క్రియ అంతా కాంగ్రెస్ పార్టీయే అని జగ్గారెడ్డి స్పష్టంచేశారు.కాగా, ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.