సాగునీటి వాటాపై విద్యాసాగర్ రావు పోరాటం మరువలేనిది : కేటీఆర్ ట్వీట్

-

సాగునీటి వాటా కోసం ఆర్ విద్యాసాగర్ రావు ఎనలేని పోరాటం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు,తొలి తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా పనిచేసిన విద్యాసాగర్ రావు వర్థంతి సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు.ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో సులువుగా వివరించిన మేథావి మన విద్యాసాగర్ రావు అని కొనియాడారు. తెలంగాణ జనహృదయాల్లో ఒక జలవిజ్ఞాన నిధిగా, నీళ్ళ సారుగా నిలిచిపోయిన వారు సాగునీటి రంగంలో చేసిన కృషి అనితరసాధ్యమని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం వారి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అని కీర్తించారు.కేసీఆర్ ఆహ్వానంతో విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా సేవలందించారని, అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో విలువైన సలహాలు, సూచనలు అందించారని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news