తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికి అసలు ఎందుకు దు:ఖం వస్తుందని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్ జిల్లాలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూ భారతి చట్టం రూపొందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు చూడలేక మాజీ సీఎం కేసీఆర్ కి దు:ఖం వస్తుందన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 02 వరకు పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లోని భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు మాట వినలేదని కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.