విశాఖలోని సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 గురు భక్తులు మృతి చెందారు. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 గురు మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది.

సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. దింతో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు… కొంత మందిని కాపాడారు. ఇక ఈ ఘటనాస్థలికి చేరుకుని హోంమంత్రి అనిత, కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు.
బ్రేకింగ్ న్యూస్
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి
రాత్రి కురిసిన భారీ వర్షాలకు కూలిన సిమెంట్ గోడ
స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై కూలిన గోడ
ఆరు మృతదేహాలు లభ్యం.. శిథిలాల కింద ఉన్న మరో రెండు మృతదేహాలు
సహాయక చర్యలు… pic.twitter.com/3jnA9pzqr4
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2025