ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్యగమనిక. రేపటి నుంచి అనగా మే1 నుంచి 31 వరకు యూనివర్సిటీ అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో క్యాంపస్ పరిధిలోని హాస్టళ్లు,మెస్‌లను పూర్తిగా మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ బుధవారం సర్య్కులర్ జారీచేశారు.
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, తాగునీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని అందులో పేర్కొన్నారు.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, జూన్ 1న హాస్టళ్లు, మెస్‌లను తిరిగి తెరుస్తామన్నారు.ఓయూ పరిధిలోని హాస్టళ్లు, మెస్‌లకు సెలవులు ప్రకటించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.