ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు.ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
మోడీ పర్యటనలో భాగంగా 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని వెల్లడించారు.ఇదిలాఉండగా, మే 2 ప్రధాని మోడీ అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని పున: ప్రారంభించనున్నారు. అందుకోసం ఏపీ సర్కార్ ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేసింది .