ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకో వెళ్లవద్దని సమ్మె ఆలోచన. వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని ఇటువంటి పరిస్థితుల్లో అవతలి వారు రాజకీయ ప్రేరేపితంతో కపుడు మంటతో, అసూయతో విషపు మాటలు నమ్మి సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించాలని మేము చేయగలిగింది ఏది ఉన్నా చేస్తామని అన్నారు.
ఈ సంస్థ మీది అని గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ పార్టీ 50 మంది కార్మికులను పొట్టనపెట్టుకుంది కానీ మీతో మాట్లాడలేదన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒక్కటేనని రాష్ట్రానికి వచ్చే ఆదాయ లెక్కలన్నీ మీ ముందే ఉంచుతాను. ఏ పథకం ఆపాలో పథకం ఆపకూడదో మీరే చెప్పండన్నారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం బాగోలేదని కార్మిక సోదరులందరూ సహకరకించాలన్నారు. ఒక సంవత్సరం అయితే కుదురుకుంటామన్నారు.