సరిహద్దుల్లో దాయాది కవ్వింపు చర్యలు

-

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత విఘాతం తలపెట్టే ప్రమాదం ఉందన్న భయంతో పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎక్కడ ఘర్షణ ప్రారంభిస్తుందోనన్న ఉత్కంఠతో ఒక్కవైపు సైనిక మోహరింపులు చేపడుతుండగా, మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్ రేంజర్లు వరుసగా కాల్పులు జరుపుతూ ఉద్రిక్తతను పెంచుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, కరాచీ పోర్టులో పాకిస్తాన్ నేవీ భారీగా నౌకలు, జలాంతర్గాములను మోహరించినట్టు తెలుస్తోంది. ఇంతకీ, పాకిస్థాన్ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన బార్మెర్ సమీప లాంగేవాలా సెక్టార్ వద్ద ఆధునిక రాడార్ వ్యవస్థలతో పాటు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్‌ సిస్టమ్‌లు మోహరించింది. గగనతల నుంచి వచ్చే దాడులపై ముందస్తు స్పందన కోసం ఈ ఏర్పాట్లు చేపట్టినట్టు విశ్లేషకుల అభిప్రాయం. అలాగే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకకాలంలో ‘ఫిజా-ఎ-బదర్’, ‘లాల్కర్-ఎ-మోమిన్’, ‘జర్బ్-ఎ-హైదరీ’ వంటి మూడు పెద్ద స్థాయి ఎయిర్ డ్రిల్‌లు ఏప్రిల్ 29న నిర్వహించింది. వీటిలో F-16, J-10, JF-17 వంటి యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

ఇదే సమయంలో, పాక్ ఆర్మీ స్ట్రైక్ కార్ప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో డ్రిల్‌లు చేపడుతోంది. గ్రౌండ్ అసెట్స్ రక్షణ కోసం ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్‌ని కూడా మోహరిస్తోంది. చైనా నుంచి వచ్చిన SH-15 హోవిట్జర్ యూనిట్లను ఫార్వర్డ్ లొకేషన్లకు తరలిస్తోంది. ఇప్పటికే సియాల్‌కోట్ సెక్టార్‌లో భారత వైమానిక దాడులను గుర్తించేందుకు రాడార్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. ఫిరోజ్‌పూర్ సరిహద్దుకు ఎదురుగా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాన్ని కూడా మోహరించింది. తాజాగా పాక్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతకు బలాన్నిస్తున్నాయి. భారత్ 24–36 గంటల్లో సైనిక దాడికి సిద్ధమవుతోందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news