ఐపీఎల్ 2025 హీట్ పెరిగింది…! నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. టాస్ ఓడినా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు, రాజస్తాన్ బౌలర్లపై దాడికి దిగింది. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 20 ఓవర్లలో ఏకంగా 217 పరుగుల మౌంటెయిన్ స్కోర్‌ను రిజిస్టర్ చేసింది. ముంబై తరఫున రికెల్ టన్ 61 పరుగులు చేసి జోరు చూపించగా, రోహిత్ శర్మ 53 పరుగులతో తన క్లాసికల్ స్టైల్‌తో మెరిశాడు. వారిద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (48) , హార్దిక్ పాండ్య (48) పరుగుల దూకుడు చూపారు. ఈ కాంబినేషన్‌తో రాజస్తాన్ బౌలర్లు తేలిపోయారు. అయితే, తీక్షణ, పరాగ్ ఒక్కో వికెట్ తీసి చిన్న బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పుడీ స్కోర్‌ను ఛేదించాలంటే రాజస్తాన్ రాయల్స్‌కు అసలు పరీక్ష మొదలైంది. 218 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలో అడుగుపెట్టనున్న రాజస్తాన్ జట్టు, ఇటీవల కోల్‌కతాతో మ్యాచ్‌లో చూపిన మ్యాజికల్ ఫార్మ్‌ను మరల ప్రదర్శిస్తుందా? అన్నది ఆసక్తికరం. ఆ మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లోనూ అలాంటి ఆకాశాన్నంటే ఆట చూపిస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.