సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు.. ఎందుకంటే?

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియామకంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న వారినే బాల కార్మికుల కమిషన్ చైర్మన్‌గా నియమించాలని 2015 కేంద్ర నిబంధనలు అమలులో ఉండగా..

వాటిని తుంగలో తొక్కి సీతా దయాకర్ రెడ్డిని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియామించారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నియామకం పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జస్టిస్ పుల్లా కార్తిక్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అందించినట్లు తెలిసింది. కాగా, హైకోర్టు నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉన్నది.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news