భారత్ వర్సెస్ పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశం కుట్రలకు తెగబడుతోంది. పాక్ రేంజర్లు బోర్డర్ వెంట కాల్పుల విరమణకు పాల్పడుతూనే ఉన్నారు.ఈ క్రమంలోనే తమ మీద భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో తెలుసుకునేందుకు తమ గూఢచారులను పాకిస్తాన్ అలర్ట్ చేసింది.
భారత ఆర్మీకి చెందిన కదలికలను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే పాక్ గూఢాచారులపై అలర్ట్ అయిన భద్రతా దళాలు.. ఆదివారం ఉదయం ఇద్దరు గూఢచారులను అరెస్ట్ చేశారు. వీరు భారత దేశ సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. వీరిని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్‌లో అరెస్ట్ చేయగా..ఇప్పటివరకు ఎలాంటి సమాచారం పాక్‌కు ఏ విధంగా చేరవేశారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం.