ఏపీలో దారుణం.. లేడీస్ హాస్టల్‌లో బాత్రూం వద్ద కెమెరాలు

-

గుంటూరులోని బ్రాడీపేటలో గల శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. తమ హాస్టల్‌లోని బాత్రూమ్ సమీపంలో సీసీ కెమెరాలు ఉంచారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యార్థినులు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ ఫిర్యాదులో, రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్‌ ప్రాంగణంలోకి వస్తున్నారని, దీనితో హాస్టల్‌లో భద్రత లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అరండల్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వారు హాస్టల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news