యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన పెంపుడు కుక్క

-

హైదరాబాద్ లో దారుణం జరిగింది. యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసింది ఓ పెంపుడు కుక్క. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. హైదరాబాద్ నగరం మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్నాడు పవన్ కుమార్ (37). ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, డోర్ ఓపెన్ చేయలేదు పవన్ కుమార్.

Pet dog kills owner by biting his private parts
Pet dog kills owner by biting his private parts

దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు పవన్ కుమార్. పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కుతిని, నోటి నిండా రక్తంతో కనిపించింది పెంపుడు కుక్క. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news