తెలంగాణాలో మరో విషాదం చోటు చేసుకుంది. బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి ఐంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ టీ2- 185 క్వార్టర్లో నివసిస్తున్నారు వేముల విజయ, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2 పరిధిలోని సీ-5 కంపెనీలో వోల్వో ఆపరేటర్గా పనిచేస్తున్నారు చిన్న కొడుకు వేముల వసంత్ కుమార్ (27).

అయితే కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు వసంత్ కుమార్. అయితే, బెట్టింగ్ యాప్‌లో నష్టాలు రావడంతో గతంలో మందలించి రూ.4 లక్షల వరకు అప్పు తీర్చాడు తండ్రి. కానీ మళ్లీ ఆన్‌లైన్ బెట్టింగ్లకు పాల్పడి..వేముల వసంత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వసంత్ కుమార్. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.