United Nations chief warns : భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్య రాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరమని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం.. కానీ యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించే చర్యలకు సహకరిస్తామని ప్రకటన చేశారు.
కాగా, జమ్మూ కాశ్మీర్ లో కలకలం. జమ్మూ కాశ్మీర్‌లో జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైంది CISF. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూ కోట్ బల్వాల్ జైళ్లు టార్గెట్‌గా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ రెండు జైళ్లల్లో పలువురు హై ప్రొఫైల్ తీవ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్స్ ఉన్నారు.