హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సేవలు.. టిక్కెట్ చార్జీలు రిఫండ్

-

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని పరిణామం ఎదురయింది. అర్ధాంతరంగా మెట్రో రైలు ఆగిపోవడంతో టికెట్ డబ్బులు కూడా మొదటిసారిగా రిఫండ్ ఇచ్చింది మెట్రో సంస్థ. ఈ సంఘటన సోమవారం రోజున అర్ధరాత్రి జరిగింది. మియాపూర్, ఎల్బీనగర్ కారిడార్ లో ఎక్కడికక్కడ మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లలో సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించడం జరిగింది. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో ఈ సమస్య తెరపైకి వచ్చింది.

అయితే ఆ సాంకేతిక సమస్య కారణంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే కారిడార్ లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లకుండా… మెట్రో స్టేషన్ మూసివేశారు. అప్పటికే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో టికెట్ తీసుకున్న వారికి రిఫండ్ కూడా చేసింది మెట్రో. ఇలా జరగడం ఇదే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు. అయితే మెట్రో సేవలకు అంతరాయం కలగడం ఇదే మొదటిసారి. చాలాసార్లు జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news