ఏపీ మళ్లీ భూకంపం వచ్చింది. ప్రకాశం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రాగా.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా..ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా భయంతో వణికిపోయింది… సోమవారం సాయంత్రం సరిగ్గా 6 గంటల 47 నిమిషాలకు జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడతో పాటు రుద్రంగి ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు ఐదు సెకన్ల పాటు భూమి తీవ్రంగా కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు సైతం స్వల్పంగా కదలడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిన అనుభవం చాలా భయానకంగా ఉందని స్థానికులు తెలిపారు. స్వల్ప భూకంపం కారణంగానే ఈ ప్రకంపనలు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.