కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళా లాయర్ భారీ మోసానికి పాల్పడినట్లు సమాచారం. నల్లగొండ జిల్లా కోర్టులో ఉద్యోగాల పేరుతో జరిగిన ఘరానా మోసం తాజాగా వెలుగుచూసింది. కోర్టులో కింది స్థాయి ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకగా.. ఓ మహిళా లాయర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించినట్లుగా తెలుస్తోంది.
ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు తీసుకోగా.. అలా మొత్తం 40 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే, తమకు ఉద్యోగాలు రావడం లేదని బాధితులు ప్రతిరోజూ కోర్టు ప్రాంగణంలో పడిగాపులు కాస్తున్నారు. వీరంతా కోర్టుకు వచ్చిన సమయంలో సదురు మహిళా లాయర్ కోర్టుకు హాజరు కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు నల్లగొండ జిల్లా ఎస్పీని కలిసేందుకు ట్రై చేసినట్లు సమాచారం.