చెప్పులు ఎత్తుకపోయేవాడి లాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు – బండి సంజయ్

-

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే దాని మీద చర్చ నడుస్తుంది.. చెప్పులు ఎత్తుకు పోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావొచ్చు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెప్పులు ఎత్తుకపోయేవాడి లాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు అని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారనున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమో అని నాకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు.. నన్ను ఎవరూ బజారులో నమ్మడం లేదని సెటైర్లు పేల్చారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news