చండీగఢ్ లో హై అలెర్ట్. చండీగఢ్ మీద పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలోనే ఎయిర్ సైరెన్స్ మోగాయి. దింతో చండీగఢ్ లో జనాలు వణికిపోతున్నారు. చండీగఢ్ ప్రజలు అందరూ ఇంట్లోనే ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

కాగా ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది సైన్యం కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియోను సైతం భారత సైన్యం విడుదల చేసింది.
చండీగఢ్ మీద పాకిస్తాన్ దాడి చేసే అవకాశం.. మోగిన ఎయిర్ సైరెన్స్..#Chandigarh #IndiaPakistanWar #UANow pic.twitter.com/h81eszsoLF
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) May 9, 2025