చైనా మిసైల్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్..

-

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో చైనా పాకిస్తాన్ కు విక్రయించిన ఆయుధాలపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. మొన్నటివరకు చైనా వస్తువులు అంటే తక్కువ ధరకు, చీప్ క్వాలిటీతో దొరుకుతాయని అందరికీ తెలిసిందే. తాజాగా భారత్, పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల్లో చైనా వస్తువులపై దారుణంగా ట్రోల్స్ అవుతున్నాయి.

పాకిస్తాన్ భారత్ మీద డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడగా..ఈ మిస్సైల్స్‌ను భారత్ సునాయాసంగా తిప్పికొట్టింది.ఇదిలాఉండగా పంజాబ్,రాజస్థాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్ నేలపై పడి కూడా పేలలేదు.దీంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు.. చైనా వస్తువుల మాదిరిగానే మిస్సైల్స్ కూడా పేలకుండా తుస్సుమన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. పాపం పాకిస్తాన్‌కు చైనా తక్కువ ధరకు నకిలి మిస్సైల్స్‌ను పంపించిందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news