వీర జవాన్ మురళీ నాయక్‌ మరణవార్త విని రోదిస్తున్న కుటుంబసభ్యులు

-

వీర జవాన్ మురళీ నాయక్‌ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. తెలుగు జవాన్ మృతి చెందాడు. దేశ రక్షణలో తెలుగు జవాన్..అమరుడయ్యాడు. భారత్-పాక్ యుద్ధంలో ప్రాణాలర్పించాడు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన విడుదల అయింది.

Family members of brave soldier Murali Naik mourn the death of the deceased

వీర జవాన్ మురళీ నాయక్‌ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్‌ మురళీ నాయక్‌… స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. ఇక ఎక్స్ వేదికగా మురళీ నాయక్ కు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.

దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news