ఆంధ్రప్రదేశ్ లో నామినేటేడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఖాలీగా ఉన్న నామినేటేడ్ పోస్టుల భర్తీ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు నామినేటేడ్ పోస్టులను ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటేడ్ చైర్మన్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు.
డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కామెపల్లి సీతారామయ్య, కాకినాడ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా తుమ్మల రామస్వామి, ఏలూరు DCM చైర్మన్ గా చాగంటి మురళీ కృష్ణ, ప్రకాశం కసిరెడ్డి శ్యామల, కాకినాడ చైర్మన్ గా పిచ్చేటి చంద్రమౌలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.