ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కోసం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు… చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు… కథనాలు వెలువడుతున్నాయి. ఈ హెలికాప్టర్ సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా వినియోగించుకునేలా… ప్లాన్ చేస్తున్నారు. కొత్త హెలికాప్టర్ మోడల్ ఎంపిక కోసం కమిటీని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏ మోడల్ కొనుగోలు చేయాలి.. ఎంత ధర పెట్టాలి..? అనే వివరాలపై… ఈ కమిటీ దిశా నిర్దేశం చేస్తుంది. ఫైనల్ నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన తర్వాత.. హెలికాప్టర్ కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేస్తుందన్న వార్త బయటకు రావడంతో వైసిపి నేతలు రెచ్చిపోతున్నారు. ఆదాయం లేదంటూనే హెలికాప్టర్ అవసరమా అంటున్నారు.
- కొత్త హెలికాఫ్టర్ కొనుగోలుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం
- సీఎం తో పాటు ఇతరులు వినియోగించేందుకు కొత్త హెలికాఫ్టర్
- కొత్త హెలికాఫ్టర్ మోడల్ ఎంపిక కోసం కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు