డెలివరీ తర్వాత జుట్టు రాలడానికి కారణాలు ఇవే..!

-

చాలా శాతం మంది మహిళల్లో జుట్టు రాలిపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే దాని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆహారం, నిద్ర మరియు జీవన విధానం కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం. మహిళలు ప్రెగ్నెన్సీ తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా, జుట్టు రాలడం కూడా ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడు నుండి ఐదు నెలల వరకు జుట్టు ఆరోగ్యం బాగుంటుంది, కానీ తర్వాత జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. దీనికి కారణం ఒత్తిడి మరియు హార్మోనల్లో మార్పులు అని నిపుణులు చెబుతున్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ప్రెగ్నన్సీ సమయంలో మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటారు. దీంతో జుట్టు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ విధంగా ఒత్తైన జుట్టుని పొందుతారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వలన జుట్టు రాలుతుంది. అదేవిధంగా, అటువంటి సమయంలో జుట్టు సంరక్షణ కూడా సరిగ్గా ఉండదు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి గురవుతారు. దాని వలన కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది, దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

మీ ఆహారంలో భాగంగా ప్రోటీన్, కాల్షియం, బిటా కెరోటిన్ వంటి పోషకాలను తీసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటితో పాటుగా క్యాల్షియం మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే టీ, కాఫీ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రక్త సరఫరా బాగుండాలి, కనుక జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఇనుము ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అదేవిధంగా, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి విటమిన్ డి సహాయం చేస్తుంది. కనుక ఈ మార్పులను మీ జీవం విధానం లో చేసుకుని ఆరోగ్యమైన జుట్టుని పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news