ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి మళ్లీ పునః ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ కీలక మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరు వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇవాళ కీలక ఫైట్ ఉండనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఇక ఇవాల్టి మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఓడిపోతే గనక… ఇంటి దారి పట్టాల్సి ఉంటుంది. ఇవాల్టి మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాస్ గెలిచిన జట్టు అప్పటి పరిస్థితిలను బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.