ఆంధ్ర ప్రదేశ్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగి .. నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులు మెడికల్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.