తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు ఉన్నట్లు పేర్కొంది.

గంటకు 50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చించింది వాతావరణ శాఖ. ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా… తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, మెదక్ అలాగే వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి పడ్డాయి. అర్ధరాత్రి గాలులతో కూడిన భారీ వర్షం.. పడింది. ఇవాళ కూడా చల్లటి వాతావరణం నెలకొంది. వర్షం ఎక్కువగా ఉత్తర తెలంగాణలో మాత్రమే పడనున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.