Couple having romance : విజయవాడలో ప్రేమికులు రెచ్చిపోయారు. సినిమాలు స్టైల్లో… బైక్ పైనే రొమాన్స్ చేసుకుంటూ… రచ్చ చేశారు. మద్యం మత్తులో బైక్ పై వెళ్తూ… యువజంట రొమాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నడిరోడ్డుపైనే ఈ ప్రేమ జంట అనుచితంగా ప్రవర్తించి సభ్య సమాజం సిగ్గుపడేలా… చేస్తోంది. ఈ సంఘటన విజయవాడలోని నేషనల్ హైవే 16 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ పైన జరిగింది. అయితే ఈ ఇద్దరు లవర్స్… బైక్ పైన వెళ్తున్న వీడియోను వెనుక నుంచి మరో వాహనదారుడు క్యాప్చర్ చేశాడు.
అనంతరం సోషల్ మీడియాలో పెట్టేసాడు. విజయవాడ ఫ్లైఓవర్ లపై లవర్స్ విచ్చలవిడిగా.. రెచ్చిపోతున్నాడని విజయవాడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… వాళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
విజయవాడ రోడ్లపై గలీజ్ పనులు
మద్యం మత్తులో బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసుకున్న జంట
విజయవాడ హైవే – రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ వద్ద బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట pic.twitter.com/GCKItHPe22
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2025