తెలంగాణ రాష్ట్ర మద్యం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు బ్రాండ్లపై ఫుల్ బాటిల్ కు 40 చొప్పున బాదేసింది. అంటే వాటర్ బాటిల్ తీసుకుంటే పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

అదే ఫుల్ బాటిల్ తీసుకుంటే 40 రూపాయలు అదనంగా ఇవ్వాలి. ఉదాహరణకు ఒక ఫుల్ బాటిల్ 800 రూపాయలు ఉంటే.. పెరిగిన ధరల ప్రకారం ఎనిమిది వందల నలభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ధరలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలను పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు లిక్కర్ ధరలను పెంచి మందుబాబులకు షాక్ ఇచ్చింది.