సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవించాలంటే.. పక్షుల ఫోటోలను ఈ దిశలో పెట్టండి..!

-

వాస్తు శాస్త్రంలో ఎన్నో మంచి విషయాలను చెప్పడం జరిగింది. ఆ నియమాలను పాటించడం వలన జీవితం లో ఎంతో మంచి జరుగుతుంది, ముఖ్యంగా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా జీవించవచ్చు. సహజంగా వాస్తు శాస్త్రంలో కొన్ని దిశలలో కొన్ని వస్తువులను పెట్టడం వలన ప్రతికూల శక్తి తలగిపోతుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. అదే విధంగా, ఇంట్లో పక్షుల చిత్రాలను ఈ దిశలో పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. పక్షులు స్వేచ్ఛ మరియు సానుకూలతకు చిహ్నం అని అందరికీ తెలిసిందే.

అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే పక్షుల ఫోటోలను లేక పెయింటింగ్స్‌ను ఉత్తరం వైపున పెడతారో, ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది మరియు ఆర్థికంగా ఎంతో ఉపయోగం ఉంటుంది. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. ఎగురుతున్న పక్షులు లేక అందమైన పక్షుల ఫోటోలను ఇంట్లో ఉంచడం వలన పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా, ఎంతో మంచి గుర్తింపును కూడా పొందుతారు. కనుక దక్షిణం వైపున పక్షుల ఫోటోలను పెట్టాలి. నైరుతి దిశలో పక్షుల ఫోటోలను పెట్టడం వలన వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి మరియు భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు.

అయితే నైరుతి దిశలో ఒంటరిగా ఉండే పక్షుల ఫోటోలను అస్సలు పెట్టకూడదు. గుంపుగా ఉండే పక్షుల ఫోటోలను పశ్చిమం లో పెట్టడం వలన ఆర్థిక లాభాలను పొందుతారు. దీంతో జీవితంలో మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు మధ్య ప్రేమ, ఆప్యాయత ఉండి ఎంతో ఆనందంగా ఉండాలంటే పశ్చిమ దిశలో కచ్చితంగా పక్షుల ఫోటోలను పెట్టడం ఎంతో అవసరం. ఈశాన్య దిశలో కూడా పక్షుల ఫోటోలను పెట్టవచ్చు. ఇలా పెట్టడం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు మరియు సానుకూల శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎంతో ఆనందాన్ని పొందుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news