కవిత లెటర్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కామెంట్స్ చేశారు. అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటి? ఎప్పుడంటే అప్పుడే తండ్రిని కలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కవితను కేసీఆర్ కలవట్లేదా? అసలా లేఖ రాయడానికి గల ఉద్దేశం ఏంటి? అంటూ ప్రశ్నించారు.

నిన్నటి నుండి లేఖ చక్కర్లు కొడుతున్నా ఇప్పటివరకు దానిపై ఎలాంటి స్పందన లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావొచ్చు… లెటర్ కేసీఆర్ వరకు చేరిందా? మధ్యలోనే బయటకు వచ్చిందా అనేది కూడా తెలియాలని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేయడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. కాగా తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని తెలిపారు. 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని పేర్కొన్నారు.