Bhairavam movie director apologizes to Mega fans: భైరవం సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులకు క్షమాపణలుచెప్పాడు భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల. ట్రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసాడు భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల. గత కొన్ని రోజులుగా డైరెక్టర్ విజయ్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ వస్తున్నాయి.

2011 లో ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టాడని ట్రోల్స్ చేశారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని వివరణ ఇచ్చిన భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల… తానూ మెగా అభిమానినేనని పేర్కొన్నారు. చిరంజీవి సినిమాలు చూసి పెరిగానని చెప్పుకొచ్చిన భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల… తన ప్రమేయం లేకుండా ఎవరో పోస్టు పెట్టారని కామెంట్ చేశారు.