కాంగ్రెస్ పార్టీలో ఏమి లేదు…కోనేరు కోనప్ప హాట్ కామెంట్స్

-

Former MLA Koneru Konappa made shocking comments: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నాకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు.. సిర్పూర్ నియోజకవర్గం మీద ప్రేమలేదని పేర్కొన్నారు. గ్రూప్ రాజకీయాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.

koneru konappa
Koneru Konappa Sensational Comments On congress

సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. వీర్ దండి గుండాయిపేట మధ్య బ్రిడ్జిని నేను మంజూరు చేయించి నిధులు సైతం మంజూరు చేయించా …కానీ రద్దు చేయించారని ఆగ్రహించారు. ప్రత్యక్షంగా బిజేపి పరోక్షంగా కాంగ్రెస్ నేతల పై కోనప్ప ఆరోపణలు చేశారు. అందరి ఆశీర్వాదంతో ఒంటరిగా బరిలో దిగుతానన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news