సినిమా ఇండస్ట్రీలో అనేక విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకు చాలామంది మృతి చెందారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ విలన్ మృతి చెందాడు. అది కూడా రవితేజ సినిమాలో.. విలన్ గా నటించిన ముకుల్ దేవ్ తాజాగా మరణించారు.

54 సంవత్సరాలు ఉన్న ముకుల్ దేవ్… గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో… బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ముకుల్ దేవ్… అనారోగ్యం బారిన పడ్డట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసుపత్రిలో… గత నెల రోజులుగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో తాజాగా మరణించాడు అని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ విలన్ ముకుల్ దేవ్ మృతి నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.