నేడు ఎన్టీఆర్ 102వ జయంతి. అయితే ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఇవాళ ఉదయమే ఎవరు లేని సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్ 102వ జయంతి సందర్బంగా… ఏపీ సీఎం చంద్రబాబు సంచలన పోస్ట్ చేశారు. ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుదంటే అది ఎన్టీఆర్ ఆశీర్వాదబలమే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అన్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్#NTRJr #NTRJayanthi pic.twitter.com/wPN5MPaPy9
— BIG TV Breaking News (@bigtvtelugu) May 28, 2025