బంగారం ధరలు భారీగా మరోసారి పతనం అయ్యాయి. వారం పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం మరోసారి భారీగా పతనం అయింది. ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది బంగారం ధర. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల సహా దేశీ మార్కెట్లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో బంగారం కొనుగోలు భారీగా తగ్గింది. దీనితో భారీగా పడిపోయింది ధర.
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,050 తగ్గడంతో రూ.41,920కు పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 తగ్గడంతో రూ.38,340కు తగ్గింది బంగారం ధర. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం కాస్త ఎక్కువే పడిపోయింది.
బంగారం ధర ఏకంగా రూ.1,100 పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 తగ్గడంతో… రూ.39,150కు వరకు దిగి వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1100 తగ్గడంతో రూ.40,350కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.39,990కు దిగింది. ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి.