ప్రేమ వివాహాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రేమ వివాహాలు నేటి కాలంలో చాలావరకు విఫలమవుతున్నాయి. పెళ్లిళ్లకు ఎవరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పిల్లలు ఉన్నప్పటికీ వివాహ సాంప్రదాయాన్ని పెద్దగా పాటించడం లేదు. ప్రేమించుకోవడం, విడిపోవడం, ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం చాలా కామన్. ఇక మరికొంతమంది ఒక వ్యక్తిని ప్రేమిస్తూనే మరొక వ్యక్తితో కూడా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తారు.
ఈ క్రమంలోనే కెనడాలో లారెన్స్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు. తాను ఇటీవలే లాటరీలో ఐదు మిలియన్ల కెనడియన్ డాలర్లు (రూ. 30 కోట్లు) గెల్చుకున్నాడు. క్లయిమ్ కు అవసరమైన బ్యాంకు అకౌంటు అతని వద్ద లేకపోవడంతో తాను గెలుచుకున్న డబ్బులను తన ప్రేయసి మెక్ కే ఖాతాలోకి పంపించాడు. ఆ డబ్బులను చూసిన ఆ యువతి డబ్బులు అన్ని తీసుకొని మరొకరితో పారిపోయింది. దీంతో లారెన్స్ కోర్టును ఆశ్రయించాడు. లారెన్స్ ఆరోపణలను మేక్ కే ఖండించింది. దీనిపై విచారణ కొనసాగుతోంది.